ఈ గోల్డ్ బాండ్స్ రిడంప్షన్లకు సిద్ధం
ముంబై, ఏప్రిల్ 16: ఎనిమిదేండ్ల క్రితం జారీచేసిన పలు సావరిన్ గోల్డ్ బాండ్లు ఈ ఆర్థిక సంవత్సరంలో తుది రిడంప్షన్‌కు సిద్ధమవుతున్నాయి. ప్రతీ ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్‌బ్యాంక్ ఆ ఏడాది జారీచేయబోయే వివిధ విడతల సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్‌జీబీలు) విడుదల తేదీలు, వాటి రిడంప్షన్ (నగదుగా మార్చుకోవడం) తేదీలను వెల్లడిస్తుంది. ఎస్‌జీబీల కాలపరిమితి ఎనిమిదేండ్లు. జారీచేసిన తేదీ నుంచి ఐదేండ్ల తర్వాత ముందస్తు రిడంప్షన్‌ను కూడా అనుతిస్తారు. 2016లో జారీచేసిన రెండు విడతల ఎస్‌జీబీలు ఈ ఏడాది ఇప్పటికే తుది రిడంప్షన్‌కు వచ్చాయి. వీటికి జారీచేసిన విలువతో పోలిస్తే 140 శాతం వరకూ అధిక విలువను ఆర్బీఐ ఆఫర్ చేసింది. ఈ నేపథ్యంలో 2024లో తుది రిడంప్షన్‌కు వచ్చిన, రాబోతున్న ఎస్‌జీబీల వివరాలివే..
ఎస్‌జీబీ 2016 2
2016 సెప్టెంబర్ 30న ఈ సిరీస్ బాండును రూ.3,150 ధరతో జారీచేశారు. దీంతో ఇది 2024 సెప్టెంబర్ చివరివారంలో తుది రిడంప్షన్‌కు వస్తుంది.
ఎస్‌జీబీ 2016 3
2016 నవంబర్ 17న ఈ సిరీస్ బాండును రూ.3,007 ధరతో జారీచేశారు. దీంతో ఇది 2024 నవంబర్ 17న తుది రిడంప్షన్‌కు వస్తుంది. ఈ బాండ్‌పై 2.50 శాతం వడ్డీని ఆఫర్ చేశారు.
సావరిన్ గోల్డ్ బాండ్స్2016 సిరీస్ 1
ఈ సిరీస్ ఎస్‌జీబీ 2024 ఫిబ్రవరి 8న మెచ్యూర్ అయ్యింది. 2016లో దీనిని గ్రాముకు రూ. 2,600 ధరను నిర్ణయించారు. తుది రిడంప్షన్ సమయంలో
ప్రతీ ఒక్క ఎస్‌సీబీ యూనిట్‌కు రూ.6,271 ధర ఇచ్చారు.
ఎస్‌సీబీ 2016 సిరీస్ 2
ఈ మార్చి 22న రిజర్వ్‌బ్యాంక్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 2016 ఎస్‌జీబీ 2 మార్చి 28 రిడంప్షన్ తేదీగా నిర్ణయించారు. తుది రిడంప్షన్‌లో ప్రతీ ఎస్‌జీబీ యూనిట్‌కు రూ.6,601 ధర చెల్లించనున్నట్టు ప్రకటించారు. ఈ సిరీస్ ఎస్‌సీబీలను రూ.3,119 ధరతో జారీచేశారు.
మదుపుదారులు తెలుసుకోవాల్సిన వివరాలు
బ్యాంకు పనిదినాలకు అనుగుణంగా తుది రిడంప్షన్ తేదీలు మారే అవకాశం ఉంటుంది. తేదీకి నెలరోజుల ముందుగా ఎస్‌జీబీ మదుపుదారులకు ఆర్బీఐ ఈమెయిల్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా నోటిఫికేషన్స్ పంపుతుంది.
ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకటించే 999 స్వచ్ఛత గల బంగారం ధర ఐదు పనిదినాల సగటు ఆధారంగా ఎస్‌జీబీల రిడంప్షన్ ధరను ఆర్బీఐ నిర్ణయిస్తుంది.
వ్యక్తిగత మదుపుదారులకు ఎస్‌జీబీలపై మూలధన లాభాల పన్ను మినహాయింపు ఉంటుంది.
ఎస్‌జీబీ 2016 1
2016 ఆగస్టు 5న ఈ సిరీస్ బాండును రూ.3,119 ధరతో జారీచేశారు. ఈ కారణంగా 2024 ఆగస్టు తొలివారంలో ఇది తుది రిడంప్షన్‌కు వస్తుంది. ఈ బాండ్లలో చేసిన పెట్టుబడిపై 2.75 శాతం చొప్పున వార్షిక వడ్డీ సైతం లభిస్తుంది. వడ్డీని ఆరునెలలకోసారి చెల్లిస్తారు. చివరి వడ్డీ వాయిదాను మాత్రం రిడంప్షన్ సమయంలో బాండ్‌కు నిర్ణయించిన ధరతో పాటు చెల్లిస్తారు.






