14 May, 2026 | 12:18 AM

Breaking News

ఎన్నికల నిర్వహణకు సహకరించాలి

24-04-2024 12:05 AM

కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి) : ఎంపీ ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణం లో జరిగేలా అన్ని పార్టీలు సహకరించాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే కోరా రు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, దాసరి వేణుతో కలిసి మంగళవారం వివిధ రాజకీయ పార్టీ ల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాం టి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని చెప్పారు. 25న ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నామని, ఇంటి నుంచి ఓటు వేసేందుకు దివ్యాంగులు, 85 ఏళ్లు దాటిన వృద్ధు లు ఫారం డి ద్వారా బూత్ లెవల్ అధికారికి దరఖాస్తులు అందజేయాలని సూచించారు. సభలు, సమా వేశాల నిర్వహణకు అనుమతి తప్పనిసరి అని వివరించారు. 25వ తేదీ తర్వాత ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయనున్నామని, పోలింగ్ కేంద్రాల్లో వస తుల కల్పనకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. సమావేశంలో డీఆ ర్వో లోకేశ్వర్ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.