గంజాయిని నియంత్రించాలి

24-04-2024 12:02:25 AM

వరంగల్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి) : జిల్లాలో గంజాయితో పాటు మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని వరంగల్ అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి అన్నారు. మత్తు పదార్థాల నియంత్రణపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమన్వ య సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యాసంస్థల సమీపంలో విక్రయాలు జరుపుతున్న నేపథ్యంలో నిఘా పెంచాలని, విద్యార్థులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.

అనంతరం వరంగల్ డీసీపీ రవీందర్ మాట్లాడుతూ.. జిల్లా లో గంజాయి సాగు లేదని, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న గంజాయిని అడ్డుకునేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నట్లు వెల్ల డించారు. ప్రజలు గంజాయి, స్మగ్లింగ్ తదితర విషయాలపై టోల్ ఫ్రీ నంబర్ 87126 61111కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు, డీఈ ఓ వాసంతి, అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ నాగేందర్‌రావు, ఏసీపీలు నంది రాం నాయక్, కిరణ్‌కుమార్, అటవీశాఖ అధికారి సదానందం, వ్యవసా య అధికారి శ్రీధర్ పాల్గొన్నారు.