calender_icon.png 12 November, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10 మందికి రూ.లక్ష జరిమానా

12-11-2025 07:32:03 PM

సిద్దిపేట క్రైం: సిద్దిపేటలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 10 మందికి న్యాయమూర్తి రూ.లక్ష వెయ్యి జరిమానా విధించారని ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కొన్ని రోజుల క్రితం నర్సాపూర్, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తాలతో పాటు రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీ చేయగా, 10 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుపడ్డారని చెప్పారు. వారిని బుధవారం అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వి.తరణి ముందు హాజరుపరచగా జరిమానా విధించారని తెలిపారు.