calender_icon.png 12 November, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమకొండ జేఎన్ఎస్ లో కొనసాగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్

12-11-2025 07:35:01 PM

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో డిడిజి(స్టేట్స్), జోనల్ రిక్రూటింగ్ ఆఫీస్ చెన్నై, డైరెక్టర్ రిక్రూటింగ్ ఏఆర్ఓ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో భాగంగా ఆర్మీ పరీక్షలో ఇంతకుముందే ఉత్తీర్ణత సాధించిన మూడు జిల్లాలకు చెందిన అభ్యర్థులకు ఆర్మీ అధికారులు ఆర్మీలో ఎంపికకు వివిధ పరీక్షలను బుధవారం నిర్వహించారు. కోమురంభీమ్ ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన అభ్యర్థులు 794 ఆర్మీ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులు కాగా జేఎన్ఎస్ లో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఎంపిక పరీక్షకు 623 హాజరయ్యారు.

ఈ సందర్భంగా మూడు జిల్లాలకు చెందిన 623 మంది అభ్యర్థులకు ఆర్మీ అధికారులు రన్నింగ్, ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షలను నిర్వహించి అభ్యర్థుల ఎత్తు, బరువు, ఛాతీ ప్రమాణాలను కొలిచారు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొంటున్న అభ్యర్థులు నిర్ణీత సమయంలో పరుగును పూర్తి చేసేందుకు ఉత్సాహంగా పరిగెత్తుతున్నారు. ఆర్మీలో చేరడమే లక్ష్యంగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాగా మంగళవారం రన్నింగ్, ఫిజికల్ ఫిట్నెస్, పరీక్షల్లో పాల్గొన్న అభ్యర్థులకు బుధవారం మెడికల్ ఎగ్జామ్ నిర్వహించారు.