కొట్ర గ్రామంలో దొంగలు పడ్డారు
09-06-2024 01:36 PM
వెల్దండ: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో శనివారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. కొట్ర గ్రామంలోని కోళ్ల ఫారం పరిసరాల్లో ఉన్న బాలచంద్రమ్మ అనే మహిళ ఇంట్లో చొరబడి బీరువాలో దాచి ఉంచిన పది తులాల వెండి, రెండు తులాల బంగారం, 17వేల నగదు దోచుకెళ్ళినట్లు బాధితురాలు తెలిపింది. ఇంటికి తాళం వేసి వ్యక్తిగత అవసరాల నిమిత్తం వేరే ఊరు వెళ్ళగా తాళం వేసిన వీళ్ళనే దొంగలు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకొని క్లూస్ టీం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలను సేకరిస్తున్నారు.






