ఆకట్టుకున్న మోడీ కార్వింగ్
రాజన్న సిరిసిల్ల, విజయక్రాంతి: నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న సందర్భంగా ఓ కార్వింగ్ కళాకారుడు పుచ్చకాయపై చేసిన కార్వింగ్ ఆర్ట్ అందరినీ ఆకట్టుకుంది. సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కార్వింగ్ కళాకారుడు, ఆర్టిస్ట్ శ్యామంతుల అనిల్ పుచ్చకాయపై నరేంద్ర మోడీని చెక్కడం జరిగిందని పేర్కొన్నారు. గతంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పుచ్చకాయపై కార్వింగ్ చేశామన్నారు.
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేసి ప్రాణ ప్రతిష్ట చేసిన సందర్భంగా రామ మందిరాన్ని, శివరాత్రి పండుగ సందర్భంగా శివున్ని, వినాయక చవితి సందర్భంగా మహాగణపతిని, క్రిస్మస్ వేడుక సందర్భంగా శాంతా క్లాస్, భారత జవాన్ అభినందన్, క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఇలా అనేక చిత్రాలను పుచ్చకాయ, గుమ్మడికాయపై చిత్రాలను కార్వింగ్ చేయడం జరిగిందని తెలిపారు.






