27 June, 2026 | 3:23 PM

ఒక్క రోజులో రూ.31 లక్షల కోట్ల సంపద ఆవిరి

05-06-2024 12:34 AM

మంగళవారం నాటి పతనంతో ఒక్క రోజులోనే రూ.30 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ గత ట్రేడింగ్ సెషన్‌లో రూ.425,91,511 లక్షల కోట్ల ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయికి పెరగ్గా, తాజాగా అది రూ.31,07,806 కోట్లు తరిగిపోయి రూ.3,94,83,705 లక్షల కోట్లకు (4.73 ట్రిలియన్ డాలర్లు) పడిపోయింది. ఇంట్రాడేలో ఈ నష్టం రూ.35 లక్షల కోట్లకు చేరింది. సంకీర్ణ ప్రభుత్వంతో ఎదురయ్యే  సవాళ్ల పట్ల మార్కెట్‌కు అవగాహన ఉన్నదని, ఈ కారణంగా పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ జరిగిందని, మరికొద్ది రోజులు లాభాల స్వీకరణ కొనసాగుతుందని తాము అంచనా వేస్తున్నట్లు అసిత్ మెహతా ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ భామ్రే చెప్పారు.