అదానీ గ్రూప్ షేర్లు అతలాకుతలం 20 శాతం వరకూ క్షీణత
05-06-2024 12:40 AM
గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు అతలాకుతలం అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ అదానీ గ్రూప్‌కే అన్నీ కట్టబెడుతున్నారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదే పదే విరుచుకుపడిన సంగతి తెలిసిందే. తాజా ఎన్నికల్లో బీజేపీ గెలిచే స్థానాల సంఖ్య మెజారిటీకంటే తక్కువగా ఉండటంతో ఆ గ్రూప్ షేర్లను ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున విక్రయించారు. దీనితో అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ 19.13 శాతం పడిపోయింది. అదానీ పోర్ట్స్ 20 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 19.80 శాతం, అదానీ పవర్ 19.76 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 18.55 శాతం, అదానీ పవర్ 19.76 శాతం, అంబూజా సిమెంట్స్ 19.20 శాతం, ఎన్డీటీవీ 15.65 శాతం, ఏసీసీ 14.49 శాతం, అదానీ విల్మార్ 9.81 శాతం చొప్పున పతనమయ్యాయి.






