ఎన్నికల ప్రక్రియలో బీఎల్‌ఎ నాయకులదే కీలకపాత్ర
నియోజవర్గ సమన్వయకర్త కత్తి వెంకటస్వామి, ఎమ్మెల్యే సామేలు
తుంగతుర్తి, జూన్ 12: ఎన్నికల ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్ లదే కీలక పాత్ర అని, ఓటర్ల జాబితా సవరణ వీరితోనే సాధ్యపడుతుందని ఏఐసీసీ ఓబీసీ నాయకుడు, నియోజకవర్గ సమన్వయకర్త కత్తి వెంకటస్వామి, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు.
శుక్రవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ-ఎస్ ఐ ఆర్ పై బిఎల్‌ఏలకు అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటు తొలగించకుండా జాగ్రత్తగా ఉండవలసిన ఆవశ్యకత ఉందన్నారు. బూత్ లలో ఏ ఒక్క ఓటు పోకుండా చూసుకునే బాధ్యత బిఎల్‌ఏదేనన్నారు. .ప్రతి అర్హుడికి ఓటు హక్కు అందేలా ప్రతి బి ఎల్ ఎ బాధ్యతతో పనిచేసి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు.
ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీనీ, తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో పోల్చడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటే అత్యంత శక్తివంతమైన ఆయుధం.దేశ భవిష్యత్తును నిర్ణయించే అధికారం ప్రజల చేతుల్లోనే ఉంటుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, డిసిసి అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్, గ్రామ కమిటీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.






