ఇచ్చోడ ఇండోర్ స్టేడియం మందుబాబులకు అడ్డా!
- చోద్యం చూస్తున్న పోలీసులు...
- భవనం ప్రారంభం కంటే ముందే శిథిలావస్థకు...?
- ఉపయోగంలోకి తీసుకురావాలంటున్న స్థానికులు
- నిర్వహణ ఎవరు చూడాలో నేటికీ క్లారిటీ లేదు..?
ఇచ్చోడ, ఆగస్టు ౨౧ (విజయక్రాంతి): అది ఆటలాడడానికి నిర్మించిన భవనం... కానీ అందులో ఆటలకు బదులుగా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గ్రామీ ణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో లక్షలు వెచ్చించి నిర్మించిన భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. జిల్లాలోని ఇచ్చోడ మండల కేంద్రంలో గత నాలుగేళ్ళ క్రితం ఇండోర్ స్టేడియం నిర్మా ణం చేపట్టారు.
అయితే నాలుగేళ్ల క్రితం నిర్మాణం చేపట్టిన, ఇప్పటి వరకు ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించకపోవడంతో భవ నం ప్రారంభం కంటే ముందే శిథిలావస్థకు చేరుతుంది. దీనికి తోడు స్టేడియం నిర్వాణ లేక, నిఘా కరువు అవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. స్టేడియం భవనాన్ని ప్రారంభించకపోవడం తో క్రీడాకారులకు అందుబాటులోకి రాలే దు. పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ భవనాన్ని క్రీడల శాఖకు అప్పగించ కపోవడంతో అసలు నిర్వహణ ఎవరు చూడాలో ఇంకా మండల వాసులకు, స్థానిక అధికారులకుగాని క్లారిటీ లేకుండా పోయింది.
భవనం పూర్తయిన తలుపులు, గేట్ల నిర్మాణం చేపట్టకపోవడంతో అసంపూర్తిగా ఉన్న భవనంలో అసాంఘిక కార్యకలాపాలు యదేచ్చగా సాగుతున్నాయి. అటువైపుగా పోలీసుల పెట్రోలింగ్ లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. దినము రాత్రి అనే తేడా లేకుండా ఇండోర్ స్టేడియం లో మందుబాబులు మద్యం సేవించడంతో ఎక్కడ చూసిన పగిలిన బీరు సీసాలు... వాడిన కండోమ్‌లు దర్శనమిస్తున్నాయి. భవనంపై పర్యవేక్షణ లేకపోవడంతో గోడలు పగుళ్లు తేలడం, ఫ్లోరింగ్ పగిలిపోవడం, కిటికీలు తదితర వస్తువులు దొంగల పాలవుతున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి, క్రీడల కోసం అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
భవనాన్ని మాకు అప్పగించలేదు...
ఇచ్చోడలో నిర్మించిన ఇండోర్ స్టేడి యం భవనాన్ని ఇప్పటికి తమకు అప్పగించ లేదు. గతంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఉట్నూర్, ఇచ్చోడలలో ఈ భవనాలు నిర్మాణం జరిగిన ట్లు తెలిసింది. కానీ ఇప్పటికీ భవనాలను తమ క్రీడల శాఖకు అప్పగించక పోవడంతో ఇండోర్ స్టేడియంలో క్రీడలు నిర్వహించలేకపోతున్నాం.
జక్కుల శ్రీనివాస్,
జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి






