ఇది సర్కార్ కాదు.. సైతాన్: డాక్టర్ ఆంజనేయగౌడ్
03-09-2026 | 12:46am
గద్వాల్, సెప్టెంబర్ 2: కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా బీఆర్‌ఎస్ శ్రేణులు (BRS ranks) బుధవారం గద్వాల్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా రాష్ట్ర స్పోరట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, గ్యారంటీల అమలులో విఫలమైందని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
రైతులకు విద్యుత్, సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్ నాయకులు హనుమంతు నాయుడు, బీఎస్ కేశవ్ విమర్శించారు. కార్యక్రమంలో పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






