2 September, 2026 | 9:08 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం

02-09-2026 | 08:38pm

స్వంత ఇంటి కల సాకారానికి మార్గం సుగమం 

ఏఐటీయూసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్

భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 02(విజయక్రాంతి) : సింగరేణి కార్మికుల(Singareni workers)కు పెరిక్స్ పై  ఇన్కమ్ టాక్స్ రద్దుకు యాజమాన్యం అంగీకరించిందని ఏఐటీయూసీ(AITUC) ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ తెలిపారు. కేటీకె ఓసీపి 3 గనిలో పిట్ సెక్రటరీ ఎల్ శంకర్(L. Shankar) అధ్యక్షతన బుధవారం గేట్ మీటింగ్ నిర్వహించగా రాజ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ ఆర్ ఎల్ సి మీటింగులో ఎంతో కాలంగా పెండింగులో ఉన్న కార్మికుల సమస్యలను  21 డిమాండ్లను యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు.

ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్న కార్మికుల స్వంత ఇంటి కల త్వరలోనే నెరవేరబోతుందని పేర్కొన్నారు. అదేవిధంగా 2016, 17 జేఎంఈటీలకు ఓవర్ మెన్ పదోన్నతులు కల్పించేందుకు, కార్మికులు ఎదుర్కొంటున్న మారు పేర్ల సమస్యను పరిష్కరించేందుకు అంగీకరించారని తెలిపారు. కార్మికుల సహజ మరణం సంభవించిన సందర్భాలలో కార్మికుల కుటుంబాలకు బ్యాంకు, కంపెనీ ద్వారా మొత్తంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే విధంగా ఒప్పందం చేసుకున్నారని, పెండింగులో ఉన్న149 మంది డిపెండెంట్లకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వడం కోసం చర్చించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసి నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.