6 May, 2026 | 8:21 PM

తెలుగు సినిమాలు వెయ్యి కోట్ల క్లబ్‌లోకి వెళ్లేది అందుకే!

02-09-2025 12:00 AM

శివకార్తికేయన్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘మదరాసి’, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శ్రీలక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో శివకార్తికేయన్ మాట్లాడుతూ.. ‘ఇది ఎ.ఆర్. మురుగదాస్ సినిమా. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు లాంటి పెద్ద స్టార్స్‌ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ మురుగదాస్.

ఆయనతో కలిసి వర్క్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సాలిడ్ ఫిల్మ్ ఇచ్చారు. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ తిరుపతి ప్రసాద్. చాలా సింపుల్ పర్సన్. చాలా పెద్ద సినిమా తీశారు. కంటెంట్ ఉంటే ఎంతైనా ఖర్చు చేస్తారు. ఆయనలో ఆ క్వాలిటీ నాకు చాలా ఇష్టం. అందుకే తెలుగు సినిమాలు తరచుగా వెయ్యి కోట్లకు వెళ్తుంటాయి. ఈ సినిమాలో రుక్మిణి హీరోయిన్. చాలా టాలెంటెడ్.

ఈ సినిమాలో లవ్, యాక్ష న్.. రెండు పిల్లర్స్. అందులో లవ్ పోర్షన్ అద్భుతంగా రావడానికి కారణం తనే. ఈ సినిమాలో మరో పిల్లర్ విలన్ విద్యుత్ జమ్వాల్. ఆయనతో చేసే యాక్షన్ సీక్వెన్స్ చాలా క్రేజీగా ఉంటాయి’అన్నారు. హీరోయిన్ రుక్మిణి వసంత్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఒక అద్భుతమైన టీంతో కలిసి పని చేశాను. యాక్షన్ లవ్ అన్ని ఎమోషన్స్ ఉన్న అద్భుతమైన ఎంటర్ టైనర్ ఇది.

కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు. నిర్మాత ఎన్వి ప్రసాద్ మాట్లాడుతూ... ‘మేము తమిళ్ నుంచి తెలుగుకి సినిమాలు తీసుకొస్తుంటాం. ఫస్ట్ టైం డైరెక్టర్ మురుగదాస్ వల్ల తమిళ్లో చేశాం. శివ కార్తికేయన్  హిట్ చిత్రం ‘అమరన్’ తర్వాత వస్తున్న ఈ సినిమాని ఎక్కడా రాజీ పడకుండా చాలా ప్రతిష్టాత్మకంగా తీశాం. సినిమా విజువల్ వండర్‌గా ఉంటుంది. శివ కార్తికేయన్ కెరీర్‌లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది’ అని తెలిపారు.