6 May, 2026 | 9:11 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

మిత్రమండలి వచ్చేది అప్పుడే

02-09-2025 12:00 AM

ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎం, విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్ర లు పోషిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తు న్న ఈ చిత్రాన్ని బీవీ వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సం యుక్తంగా నిర్మిస్తున్నాయి. కళ్యాణ్ మంతిన, భానుప్రతాప, విజయేందర్ రెడ్డి తీగల నిర్మాతలు.

ప్రేక్షకులు థియేటర్లలో నవ్వులతో నిండిన దీపావళి పండుగను జరుపుకునేలా.. ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్న ట్లు తాజాగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్, వీడియో కూడా మెప్పించి అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ చిత్రానికి ఆర్‌ఆర్ ధ్రువన్ సంగీతం, ఛాయాగ్రాహకుడిగా సిద్ధార్థ్ ఎస్‌జే, ఎడిటర్‌గా పీకే, కళాదర్శకుడిగా గాంధీ నడికుడికర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.