calender_icon.png 14 December, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘వృషభ’కు ఆత్మలాంటి గీతం

14-12-2025 01:10:26 AM

మోహన్‌లాల్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వృషభ’. కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సీకే పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మిస్తున్నారు. దర్శకుడు నంద కిషోర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సమర్జీత్ లంకేశ్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా, గరుడ రామ్, వినయ్ వర్మ, అలీ, అయప్ప పీ శర్మ, కిషోర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

డిసెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమా విడుదల కానుండగా, మేకర్స్ శనివారం తొలిగీతం ‘అప్పా..’ను విడుదల చేశారు. సామ్ సీఎస్ సంగీతం సమకూర్చిన ఈ పాటను హిందీ, కన్నడ, తెలుగులో విజయ్‌ప్రకాశ్.. మలయాళంలో మధుబాలకృష్ణన్ పాడారు.

ఈ గీతానికి సాహిత్యాన్ని మలయాళంలో వినాయక్ శశికుమార్, తెలుగులో కళ్యాణ్‌చక్రవర్తి త్రిపురనేని, హిందీలో కార్తీక్ ఖుష్, కన్నడలో నాగార్జునశర్మ అందించారు. తండ్రీకొడుకుల మధ్య పవిత్రమైన, గొప్ప అను బంధాన్ని తెలియజేసే ఈ పాట కథకు ఆత్మ లాంటిదని టీమ్ పేర్కొంది. ఎస్‌ఆర్‌కే, జనార్ధన్ మహర్షి, కార్తీక్ డైలా గ్స్ రాశారు. పీటర్ హెయిన్స్, స్టంట్ సిల్వ, గణేశ్, నిఖిల్ యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేశారు.