calender_icon.png 14 December, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంకీ మామా.. లుక్ అదిరింది!

14-12-2025 01:11:45 AM

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రమోషన్స్ ఇప్పటికే హై గేర్‌లో వున్నాయి. సంక్రాంతికి రానున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. శనివారం వెంకీ మామకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిత్రబృందం ఆయన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ప్రత్యేకంగా రూపొం దించిన వీడియో ద్వారా ఈ అప్డేట్‌ను పం చుకున్నారు.

ఫస్ట్‌లుక్‌లో వెంకటేశ్ తనదైన చరిష్మాతో ముందుకు నడుస్తూ కనిపించారు. మోడరన్ దుస్తుల్లో ఆయన స్టైల్ ఆకట్టుకుంటోంది. ఆయన వెనక భాగంలో నిలిచి ఉన్న హెలికాప్టర్, ఆయన వెంట వస్తున్న సెక్యూరిటీ సిబ్బంది.. ఇవన్నీ కలిసి వెంకటేశ్ పాత్ర కథలో ఎంతటి ప్రభావవంతంగా ఉంటుందో తెలియజేస్తున్నాయి. మరోవైపు వెంకటేశ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా చిరంజీవి.. తమ వర్కింగ్ స్టిల్స్‌ను పంచుకున్నారు.