17 April, 2026 | 9:29 PM

Breaking News

గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •   సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన   •   హిందూ సమ్మేళనం ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీ   •  

ఆశిష్‌రెడ్డి హీరోగా ఆ రెండు సీక్వెల్స్!

05-06-2025 12:03 AM

శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన సినిమాల్లో ‘ఆర్య’, ‘శతమానం భవతి’ సినిమాలు క్లాసిక్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆర్యకు సీక్వెల్‌గా ఆర్య2 ఇప్పటికే వచ్చింది. ‘శతమానం భవతి’ సీక్వెల్‌ను కూడా నిరుడు దిల్ రాజు ప్రకటించారు. కానీ ఆ సినిమా తాను చేయడం లేదని శర్వానంద్ తెలిపారు. ఇటీవల దిల్ రాజు తన బ్యానర్ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘ఆర్య3’ టైటిల్ రిజిస్టర్ చేయించారు.

అయితే ఆర్య సినిమాకు మరో సీక్వెల్ చేసే పరిస్థితిలో అల్లు అర్జున్, సుకుమార్ లేరిప్పుడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న బన్నీ.. సుకుమార్‌తో చేయాల్సిన ‘పుష్ప3’ ఉండనే ఉంది. అంటే ‘ఆర్య3’ వీరి కాంబోలో రాదని అర్థమవుతోంది. అయితే, దిల్ రాజు మాత్రం ఈ రెండు సినిమాలు తెరకెక్కిస్తున్నారని టాక్. సుకుమార్ పర్యవేక్షణలో మరో దర్శకత్వంలో తన అన్న కొడుకు ఆశిష్‌రెడ్డి కథానాయకుడిగా ‘ఆర్య3’ని తెరకెక్కించే యోచనతో ఉన్నారట దిల్ రాజు.

ఇక ‘శతమానం భవతి’ సీక్వెల్‌కు కూడా ఆశిష్‌రెడ్డినే హీరోగా అనుకుంటున్నారట. ‘శతమానం భవతి’ని తెరకెక్కించిన సతీశ్ వేగేశ్న దర్శకత్వంలోనే రెండో భాగం రూపొందనుంది. ఆశిష్‌రెడ్డి ఇప్పటికే రౌడీ బాయ్స్, లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమాలతో మెప్పించాడు. త్వరలో ‘సెల్ఫిష్’ సినిమాతో రాబోతున్నాడు. ‘దేతడి’ చిత్రంలోనూ ఆయన కథానాయకుడిగా నటిస్తున్నాడు.