3 July, 2026 | 8:42 PM

Breaking News

ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •   అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •   డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి   •   వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి   •  

13న కట్టప్ప జడ్జిమెంట్

05-06-2025 12:00 AM

‘బాహుబలి’ కట్టప్ప అంటే తెలియనివారుండరు. ఆ సినిమాలో కట్టప్పగా మెప్పించిన సత్యరాజ్ ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపొందింది. ఆయనకు ఫేమ్ తీసుకొచ్చిన క్యారెక్టర్ పేరుతోనే ఈ సినిమా వస్తుండటం విశేషం. ‘తీర్పుగల్ విర్కపడుమ్’ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో ‘కట్టప్ప జడ్జిమెంట్’ టైటిల్‌తో వస్తోంది. ధెరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మధుసూదనరావు ప్రత్యర్థి పాత్రలో నటించగా, స్మృతి వెంకట్, హరీశ్ ఉత్తమన్, రవిప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు.

దీనికి అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై రావూరి వెంటక స్వామి నిర్మాత. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాను జూన్ 13న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. మరి కట్టప్ప ఏ విషయంలో ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చాడో వెండితెరపైనే తెలుసుకోవాలని చెబుతోంది చిత్రబృందం.