9 April, 2026 | 2:45 AM

ఆ భావోద్వేగాలే మా లక్ష్యం

09-04-2026 12:00 AM

డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సరికొత్త వినోదం పంచే వేదిక చాయ్ బిస్కెట్. ఇటీవలే లాంచ్ చేసిన షార్ట్ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫారం ‘చాయ్ షాట్స్’ విశేష ఆదరణ దక్కించుకుంది. దీంతో మరో అడుగు ముందుకు వేస్తూ కొత్త సీరియల్స్‌తోపాటు తెలుగు ఐకానిక్ సీరియల్స్‌ను కూడా ప్రేక్షకుల ముం దుకు తీసుకొస్తోందీ యాప్. ఈ విశేషాలను వెల్లడిస్తూ ‘చాయ్ షాట్స్ కిట్టీ పార్టీ’ ప్రెస్‌మీట్ నిర్వహించారు నిర్వాహకులు.

ఈ సందర్భంగా చాయ్ షాట్స్ కో-ఫౌండర్ శరత్ చంద్ర మాట్లాడుతూ.. “ఋతురాగాలు’ వంటి కల్ట్ సీరియల్స్‌తోపాటు మరికొన్ని లెజెండరీ తెలుగు షోస్‌ను చాయ్ షాట్స్‌లో తీసుకురాబోతున్నాం. ఇప్పుడు ‘టీవీ ఎవరు చూస్తున్నారు?’ అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కానీ టీవీలో ఉన్న భావోద్వేగాలు, డ్రామా..  ఇవన్నీ యాప్‌లోకి తీసుకురావడం మా లక్ష్యం. అనురాగ్ రెడ్డి, రచయిత్రి బలభద్రపాత్రుని రమణి, నటి సుహాసిని, నిర్మాత నాగబాబు కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.