కాక్‌టైల్ 2’ బిగ్ అప్డేట్: రష్మిక-కృతి గ్లామర్ హంగామా… ‘జబ్ తలాక్’ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్!
షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు ‘కాక్‌టైల్ 2’. హోమి అడజానియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి మ్యాజిక్ రిపీట్ చేసేందుకు సిద్ధమవుతోంది మాడాక్ ఫిలిమ్స్. 2012లో యూత్‌ను ఊపేసిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘కాక్‌టైల్’కు సీక్వెల్‌గా రాబోతున్న ఈ సినిమా జూన్ 19న థియేటర్లలోకి రానుంది. దినేశ్ విజన్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇదిలావుండగా, మేకర్స్ మ్యూజికల్ జర్నీని ప్రారంభించనున్నట్టు తాజాగా అప్డేట్ ఇచ్చారు.
తాజా సినిమా వార్తలు, బాలీవుడ్ అప్‌డేట్స్ కోసం మా హోమ్‌పేజ్‌ను సందర్శించండి
ఈ చిత్రంలోని తొలిగీతం ‘జబ్ తలాక్’ ఏప్రిల్ 8న విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఫస్ట్ సింగిల్ అప్డేట్‌కు సంబంధించిన పోస్టర్లను హీరో షాహిద్‌తోపాటు అందాల భామలు రష్మిక మందన్న, కృతి సనన్ తదితర చిత్రబృందం తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పోస్టర్లలో రష్మిక, కృతి సోయగాలు చూసి కుర్రకారుకు మతిపోయేలా ఉన్నాయి వారి లుక్స్. ఏదేమైనా ఈ పోస్టర్లు..
బాలీవుడ్ మూవీ న్యూస్, సాంగ్ రిలీజ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెయించేశాయి. ఈ సందర్భంగా.. రష్మిక మందన్న సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ.. “మా పాట ‘జబ్ తలాక్’ ఫస్ట్ లుక్ రేపు విడుదలవుతోంది! అప్పటివరకు మా అల్లరి గ్యాంగ్‌ను చూస్తూ ఎంజాయ్ చేయండి. మా అందరి తరపున ఎంతో ప్రేమతో..” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.




