1 April, 2026 | 2:38 PM

Breaking News

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. వైసీపీ వాకౌట్‌   •   లోక్‎సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు.. కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు   •   ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •  

ప్రజల సమస్యలపై పోరాడే వారిని గెలిపించుకోవాలి

01-12-2025 12:00 AM

సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి 

అబ్దుల్లాపూర్ మెట్, నవంబర్ 30: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజల సమస్యలపై పోరాడే వారిని గెలిపించుకోవాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భం సీపీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో  జేఎన్‌ఎన్ యూఆర్ యం కాలనీలో ప్రత్యేకమైన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి హాజరై మాట్లాడుతూ... ప్రజల సమస్యలపై పోరాడే వారిని గెలిపించుకోవాలని ప్రజలను కోరారు.

పంచాయతీ ఎన్నికల్లో మండల పరిధిలోని అన్ని గ్రామాలలో సర్పంచ్, వార్డు లలో స్థానాలలో సీపీఐ పార్టీ తరపున పోటీ చేయబోతున్నట్లు తెలిపారు.  మండల పరిధిలో జేఎన్‌ఎన్ యూఆర్ యం కాలనీలో నెలకొన్న  డ్రైనేజీ సమస్యను శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ప్రజలకు మంచినీటి సమస్య తీర్చి, ఉచిత విద్య, వైద్యం అందించాలన్నారు.

కమ్యూనిస్టుల ద్వారానే ప్రజా సమస్యల పరిష్కారం అవుతాయన్నారు.   సీపీఐ  అబ్దుల్లాపూర్ మెట్ మండల కార్యదర్శి అజ్మీర హరి సింగ్ నాయక్, నేతలు నరసింహ, రమేష్ నాయక్, బిక్షపతి, నాగేశ్వరరావు, లక్ష్మణ్, నరసింహ, అన్నపూర్ణ, ప్రియా, చీరాల లక్ష్మి, లక్ష్మి, వాసిరెడ్డి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.