1 April, 2026 | 1:10 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

పూర్వ విద్యార్థుల సమ్మేళనం..

01-12-2025 12:00 AM

మొయినాబాద్, నవంబర్ 30(విజయక్రాంతి) 33 సంవత్సరాల తర్వాత ఒక ఐడిపీఎల్ కంపెనీలో పనిచేసిన అప్పటి విద్యార్థులు నేడు సమావేశం కావడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షురాలు అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంజుల రవి యాదవ్  పేర్కొన్నారు. ఆదివారం  మొయినాబాద్ మండల పరిధిలోని ఫామ్ హౌస్ లో గత 1992 సంవత్సరంలో బాలనగర్ ఐడిపీఎల్ కంపెనీలో పని చేసిన అప్రెంటిసి పూర్వ విద్యార్థులు కలుసుకొని పూర్వ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ భవిష్యత్తులో ఆర్థిక,ఉద్యోగ,వ్యాపారం లో ఒకరికొకరు తోడుగా  నిలబడాలని కోరారు  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అఖిలభారత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముదిగొండ రవి యాదవ్ మాట్లాడుతూ సమాజంలో అందరూ కలిసి మెలిసి ఉన్నప్పుడే అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతామని తెలిపారు 33 సంవత్సరాల తర్వాత కలిసిమెలిసి ఉండడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి విద్యార్థులు మరిన్ని సమ్మేళనాన్ని జరుపుకోవాలని పేర్కొన్నారు.  పూర్వ విద్యార్థులు విశ్వనాథ చారి, పరమేశ్వర్, లక్ష్మీనారాయణ, శేఖర్‌గౌడ్, భూమయ్య,శ్రావణ్,శ్రీధర్, యాదగిరి, రాజ్‌కుమార్‌లు పాల్గొన్నారు.