calender_icon.png 3 February, 2026 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2వేల కోట్ల ట్రేడింగ్ స్కాం

13-09-2024 03:30:00 AM

ప్రముఖ అస్సామీ నటి సుమిబోరా అరెస్టు

అధిక లాభాల పేరిట ప్రజల నుంచి స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు

నకిలీ సంస్థలు స్థాపించి బురిడీ కొట్టించే యత్నం

న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 12: అస్సాంలో కలకలం సృష్టించిన ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ స్కామ్‌తో సంబంధాలున్నవారిపై అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాల్ పుకాన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా ప్రముఖ అస్సామీ నటి సుమిబోరా, ఆమె భర్త తార్కక్ బోరాను గురువారం అరెస్టు చేశారు. ఈ కేసులో వీరిరువురికి ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. 

అధిక లాభాల పేరుతో..

పెట్టుబడిని రెట్టింపు చేస్తామంటూ స్కాక్‌మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ల పేరిట ప్రజల నుంచి ఇటీవల కొందరు సొమ్మును స్వీకరించారు. నకిలీ సంస్థలను స్థాపించి.. వాటి ద్వారా అస్సాం చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టించడంతో పాటు ప్రజల నుంచి వచ్చిన డబ్బుతో పలు ఆస్తుల్ని కూడబెట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు విశాల్ పుకాన్‌తో పాటు బోరా దంపతులు మరికొందరికి సంబంధం ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

మాకు సంబంధం లేదు..

ట్రేడింగ్ కుంభకోణంలో తన, తనభర్తపేరును పోలీసులు చేర్చడంపై సుమిబోరా తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆమె బుధవారం ఒక వీడియో విడుదల చేశారు. తనకు, తన భర్తకు ఈ స్కాంతో ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టం చేశారు. మేం ఎలాంటి తప్పు చేయలేదు, పారిపోలేదు. విచాణకు పూర్తిగా సహకరించేందుకు పోలీసుల ఎదుట లొంగిపోతాం అని వీడియోలో తెలిపారు. అయితే ఆమె పోస్టు పెట్టిన మరుసటి రోజే పోలీసులు ఆమెను అరెస్టు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.