10 March, 2026 | 11:56 AM

గల్ఫ్ దేశాల నుంచి 52 వేల మంది

09-03-2026 02:31 AM

ఈ నెల మొదటి వారంలో తిరిగొచ్చిన భారతీయులు

రానున్న రోజుల్లో మరిన్ని విమాన సర్వీసులు

వెల్లడించిన కేంద్ర విదేశాంగ శాఖ 

న్యూఢిల్లీ, మార్చి 8: అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దాడులతో, బాంబులు, క్షిప ణుల పేలుళ్లతో పశ్చిమాసియా మార్మోగుతోంది. అమెరికా స్థావరాలపై దాడుల పేరి ట యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్ దేశాలపైనా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగిస్తోంది. దీంతో గల్ఫ్ దేశాల్లో నివసిస్తూ యుద్ధపరిస్థితులతో అక్కడ చిక్కుకుపోయిన భారత పౌరుల భద్రతపై ఆం దోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఈ నెల మొదటి వారంలో గల్ఫ్ దేశాల నుంచి 52 వేల మందికి పైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్లు విదేశాంగ శాఖ ప్రక టించింది. పశ్చిమాసియాలోని పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ‘గల్ఫ్ రీజియన్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి విమానాల రాకపోకలను పాక్షికంగా పునరుద్ధరించడంతో ఈ నెల 1 నుంచి 7వ తేదీ మధ్యలో 52 వేల మందికిపైగా భారతీయు లు స్వదేశానికి చేరుకున్నారు.

వీరిలో సుమా రు 32 వేల మంది భారత విమానాల్లో ప్ర యాణించారు. రానున్న రోజుల్లో మరిన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. విమాన కార్యకలాపాలు ఇంకా అందుబాటులోకి రాని దేశాల్లో ఉన్న భారత పౌరులు.. స్థానిక రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్ను సంప్రదించాలి’ అని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. విదేశాల్లోని భారత పౌరుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, సాయం అవసరమైన వారందరికీ అండగా నిలిచేందుకు స్థానిక ప్రభుత్వాలతో కలసి పనిచేస్తున్నట్లు తెలిపింది. అత్యవసర సమయాల్లో హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని తెలిపింది. అదే విధంగా విదేశాంగ శాఖ కార్యాలయం లో ఓ ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. 

హెల్ప్‌లైన్ల నంబర్లు

1800118797(టోల్‌ఫ్రీ)

+911123012113

+911123014104

+911123017905