ఎజెండా లేని క్యాబినెట్ భేటీ?
18-06-2026 02:12 AM
- నేడు అనధికారిక మంత్రివర్గ సమావేశం
- రైతుభరోసా, జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై కీలక చర్చ?
హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో అనధికారిక క్యాబినెట్ సమావేశం జరగనుంది. మంత్రివర్గ భేటీకి సంబంధించి ప్రభుత్వం ఒక బులెటెన్ విడుదల చేయడంతో పాటు సమావేశంలో చర్చించే ప్రధాన అంశాలపై స్పష్టత కూడా ఇస్తారు.
అయితే గురువారం జరిగే అనధికారిక మంత్రివర్గ భేటీ ఎలాంటి ఎజెండా లేకుండానే జరగనుంది. రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతాంగ సమస్యలు, వ్యవసాయ సంక్షేమంతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికలపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలోని రైతాంగం రైతుభరోసా కోసం ఎదురు చూస్తున్నారు.






