వాహనాలకు నకిలీ పత్రాలు సృష్టించిన ముగ్గురి అరెస్టు
బోథ్ జూన్ 14 (విజయక్రాంతి): వాహన నెంబర్లను మార్చి ఇంజన్ నంబర్లను ఫోర్జరీ చేసి న కేసులో సోనాల మండల కేంద్రం కు చెందిన ముగ్గురు నిందితులను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్కు పంపడం జరిగిందని ఆదిలాబాద్ డిఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలు అదిలాబాద్ డిఎస్పి బోత్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో వివరించారు.
సోనాల మండల కేంద్రానికి చెందిన ఎస్కే నైన్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడని మాకు మీరు విజయ్ కుమార్ వాహన నానికి సంబంధించిన శశి ఇంజన్ నంబర్లను తొలగించి ఫోర్జరీ వెల్డింగ్ పనులు చేశాడని డిఎస్పీ తెలిపారు అంతేగాక పెందూర్ ఇంద్రు పాత ఇనుప సామాగ్రి కొనుగోలు చేసిన దుకాణంలో ఏపీ 23 జె 1036 వాహనానికి సంబంధించిన పత్రాలను నిందితుడికి అందించారని డిఎస్పి వివరించారు.
స్క్రాప్ చేయబడిన వాహనాల నంబర్లతో రిజిస్ట్రేషన్ పాల్పడిన మోసగాళ్లను అరెస్టు చేశామన్నారు జూన్ 13న బోత్ కోరమండల్ జంక్షన్ వద్ద పోలీసు సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా మహేంద్ర మ్యాక్స్ వాహనం పోలీసులు గమనించారన్నారు అయితే వాహనం తిరిగి వెనక్కి వెళుతున్న సమయంలో వాహనానికి సంబంధించిన ఇంజన్ నెంబర్తో పాటు శశి నెంబర్ మార్పులు చేసినటువంటి గుర్తించడం జరిగిందన్నారు.
వాహన డ్రైవర్ ను విచారించగా మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతం నుండి మహేంద్ర మ్యాక్స్ వాహనాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు వాహన కొనుగోలుదారులు ఒరిజినల్ ఆర్ సి నెంబర్లను చూసిన తర్వాతనే కొనుగోలు చేయాలని డీఎస్పీ కోరారు. విలేకరుల సమావేశంలో సిఐడి గురుస్వామి ఎస్‌ఐవి పురుషోత్తం హెడ్ కానిస్టేబుల్ మదన్లు ఉన్నారు కేసులో కీలక పాత్ర వహించిన వీరిని డిఎస్పి అభినందించారు.






