దీప్తి ఆత్మహత్య కేసులో ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్: నాచారం పీఎస్ పరిధిలో సంచలనం సృష్టించిన దీప్తి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కానిస్టేబుల్ అనిల్ భార్యకు ఐఐసీటీ(IICT)లో ఉద్యోగం ఇప్పిస్తానని దీప్తి తండ్రి సంగీత రావు రూ.15 తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ అనిల్ వేధింపులకు దిగాడు. తండ్రి తీసుకున్న డబ్బు విషయం తనకు తెలియదంటూ దీప్తి ఆవేదన వ్యక్తం చేస్తూ రెండేళ్లుగా తండ్రి నుంచి వేరుగా ఉంటున్నామని వాపోయింది. నాచారం పీఎస్(Nacharam Police Station)లో అనిల్ భార్య అనిత ఫిర్యాదుతో దీప్తి తీవ్ర మనస్థాపానికి గురైంది. కానిస్టేబుల్ అనిల్ వేధిస్తున్నారంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ఫ్యానుకు ఉరేసుకొని ఐఐసీటీ పీహెచ్ డీ స్కాలర్ దీప్తి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






