18 March, 2026 | 3:17 PM

రసాభాసగా మూడు చింతలపల్లి మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం

17-03-2026 12:00 AM

శామీర్‌పేట్, మార్చ్ 16 (విజయక్రాంతి): మూడు చింతలపల్లి మున్సిపల్ మొదటి సర్వసభ్య సమావేశం రసాభాసగా జరిగింది. సోమవారం మూడు చింతలపల్లి మున్సిపల్ చైర్మన్ జాం రవి అధ్యక్షతన మొదటి కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏజెండాలోని అంశాలను మొదలు పెట్టగానే కౌన్సిలర్ చందుపట్ల విష్ణువర్ధన్ రెడ్డి అధికారి మణిదీపల మధ్యకొద్దిసేపు మాటల యుద్యం కొనసాగింది. కౌన్సిలర్ కు తెలియకుండానే తన వార్డులో ఇందిరమ్మ ఇంటికి ముగ్గు వేయటం ఏంటి అని కమిషనర్ పై మండిపడ్డారు.

నా వార్డు పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు నాకు సమాచారం అందడం లేదని అధికారులపై విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కౌన్సిలర్ కి సమాచారం అందుకుంటే ఏలా అని ప్రశ్నించారు. వెంటనే అధికారిని మణిదీపను సస్పెండ్ లేదా డిస్మిస్ చేయాలి అని కౌన్సిలర్ విష్ణువర్ధన్ రెడ్డి కమిషనర్ ను కోరారు. దీనికి అధికారిని స్పందించి నాపై స్థానిక నాయకులు ఒత్తిడి తేవడం వల్లే రాత్రికి రాత్రి ఇందిరమ్మ ఇంటి ముగ్గు వేయాల్సి వచ్చిందని సమాధానం ఇచ్చాను.

అయినా నన్ను డిస్మిస్, సస్పెండ్ చేయటానికి నీవు ఎవరు..? నీకు ఎలాంటి అధికారం ఉంది..? అని మణిదీప ప్రశ్నించారు. వెంటనే కమిషనర్ పవన్కుమార్ చైర్మన్ జాం రవి కలుగజేసుకొని ఇకనుండి సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు కౌన్సిలర్లకు అందజేస్తామని ఇకపై ఇలాంటి తప్పులు జరగవని అందరూ ఇది మొదటి తప్పుగా భావించి క్షమించాలని కౌన్సిలర్లను కోరారు. దీంతో ఇట్టి విషయంపై సదర్ కౌన్సిలర్ శాంతించారు. తర్వాత సభను సజావు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ పవన్ కుమార్, వైస్ చైర్ పర్సన్ శశిరేఖ, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.