3 April, 2026 | 5:34 PM

అడవి పందుల వేటకు వెళ్లి.. ముగ్గురు మృతి

20-02-2025 10:29 AM

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా(Nizamabad District)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన బోధన్ మండలం(Bodhan Mandal) పెగడపల్లిలో చోటుచేసుకుంది. అడవిపందుల వేటకు వెళ్లి కరెంట్ షాక్ కు గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను సాటాపూర్ వాసులు(Satapur Residents) గంగారం, బాలమణి, కిషన్ గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.