20 May, 2026 | 10:48 AM

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

20-05-2026 10:16 AM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మంగళవారం అర్ధరాత్రి వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామానికి చెందిన అల్లి సంపత్, లింగ మల్ల సతీష్, వంశీ అనే ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళ్తూ వీరి ముందు ధాన్యం బస్తాల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ను అతివేగంతో ఢీ కొట్టగా, ప్రమాద సంఘటనలోనే సంపత్, సతీష్ మరణించగా, వంశీ వద్దన్నపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. సంఘటనస్థలికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.