తెలంగాణ, కేరళ మధ్య సారుప్యత
29-08-2024 07:39 AM
హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆహ్వానం మేరకు బుధవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేరళలోని అలప్పుజలో జరిగిన సామూహిక వివాహాలకు హాజరయ్యారు. దాదాపు 400 జంటలకు సామూహిక వివాహం కాగా.. భట్టి వారిని ఆశీర్వదించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరబ్రహ్మ ఆలయంలో జరిగిన సామూహిన వివాహ కార్యక్రమానికి తాను హాజరు కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. సంప్రదాయాల్లో తెలంగాణ, కేరళకు సారప్యత ఉన్నదని పేర్కొన్నారు.






