calender_icon.png 20 February, 2026 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరిఖనిలో కత్తిపోట్ల కలకలం

20-02-2026 10:37:47 AM

హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో(Godavarikhani) శుక్రవారం నాడు కత్తిపోట్ల కలకలం రేగింది. కుటుంబకలహాలతో ముగ్గురిపై రామ్ దూత్ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కుటుంబీకులు సుమిత్ర, ప్రణయ్, కొమురమ్మపై రామ్ దూత్ కత్తితో దాడికి దిగాడు.

తీవ్రగాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. రామ్ దూత్ సొంత బంధువులపైనే కత్తితో దాడి చేయడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. సిగరెట్ షాప్ నిర్వహణ విషయంలో వివాదం తలెత్తడంతో బాబాయ్ కొడుకు, చిన్నమ్మపై రామ్ దూత్  విచక్షణారహితంగా దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.