12 June, 2026 | 5:34 PM

Breaking News

విశాల ఐక్య ఉద్యమాలకు రైతాంగం ముందుకు రావాలి   •   విద్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్   •   వ్యాధుల నివారణపై దృష్టి సారించండి   •   అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు   •   శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •  

మేడారానికి ఆహ్వానిస్తే వచ్చేవాళ్లం

20-02-2026 01:35 AM
  1. మంత్రి సీతక్కతో రాహుల్, మల్లికార్జునఖర్గే 
  2. వచ్చే జాతరకు ఆహ్వానిస్తాం 
  3. మంత్రి సీతక్క 

హైదరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి) : మేడారం జాతర ను ఘనంగా నిర్వహించినందుకు మంత్రి సీతక్కను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అభినందించారు. మేడారం జాతర చరిత్ర, ప్రాశస్త్యం గురించి మంత్రిని అడిగి తెలుసుకున్నారు. మేడారం జాతరను ఘనంగా నిర్వహించినందుకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి సీ తక్కను  కాంగ్రెస్ అగ్రనేతలు అభినం దించారు.

ఆదివాసీల అతిపెద్ద జాత రగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతరపై సుమారు పది నిమిషాల పాటు చర్చ జరిగింది.  సమ్మక్క- సారల మ్మల పోరాట గాథను ఖర్గే, రాహుల్ ఆసక్తిగా విన్నారు. సమ్మక్క - సారల మ్మల చరిత్రను దేశవ్యాప్తంగా చాటేం దుకు సినిమా తీయాలని రాహుల్ గాంధీ సూచించారు. కాగా, పార్టీ స మావేశంలో మంత్రి సీతక్క, రాహుల్ గాంధీ మధ్య సరదా సంభాషణ జరి గింది. మేడారం జాతరకు ఆహ్వానిస్తే తాము తప్పకుండా హాజరయ్యేవార మని రాహుల్ గాంధీ అన్నారు.

‘ఆహ్వానిస్తే తాను కూడా తల్లుల దర్శ నానికి వచ్చే వాడిని’ అని మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. అయితే సమయా భావం వల్ల వ్యక్తిగతంగా ఆహ్వానించ లేకపోయినట్లు మంత్రి సీతక్క వివ రించారు. వచ్చే జాతరకు తప్పకుండా అధికారిక ఆహ్వానం అందిస్తామని సీతక్క అన్నారు. ‘ఆహ్వానం అందితే తప్పకుండా వస్తాము’ అని రాహుల్ గాంధీ, ఖర్గే హామీ ఇచ్చారు.