calender_icon.png 20 February, 2026 | 6:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన జీపీ భవనానికి మూడు గుంటల స్థలాన్ని కేటాయించాలి

20-02-2026 04:06:24 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని అక్కంపల్లి గ్రామంలో గ్రామ సభ సర్పంచ్ గుండారం వెంకా గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఇట్టి గ్రామ సభలో పారిశుద్ధ పనులు,ఉపాధి హామీ పనులు,నర్సరీ నిర్వహణ గ్రామపంచాయతీ ఆస్తులు అనగా వైకుంఠధామం, డంపింగ్ యార్డ్,క్రీడా ప్రాంగణం, పల్లె ప్రకృతి వనం, ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లను పరిరక్షించుకొనుటకు మరమత్తులు చేయుటకు గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణం కొరకు అక్కంపల్లి గ్రామ శివారులో గల సర్వేనెంబర్ 95/1లో మూడు గుంటల స్థలాన్ని కేటాయించాలని స్థానిక తహసిల్దార్, రెవెన్యూ డివిజనల్ అధికారిని కోరినట్లు గ్రామసభలో తీర్మానం చేయడం జరిగిందన్నారు.అలాగే గ్రామంలో లూజు పోల్స్, ఇనుప స్తంభాలా స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం కిచన్నపేట గల్లీలో కొత్త బోరు వేయుట గురించి కూడా తీర్మానం చేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ గుండారం వెంకా గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కిష్టయ్య,ఉప సర్పంచ్,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.