ముగ్గురు ఎస్పీలు, 30 మంది ఏఎస్పీల బదిలీ
27-11-2024 01:40 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో పోలీసుల బదిలీల పరంపర కొనసాగుతోంది. తాజాగా ముగ్గురు ఎస్పీలతోపాటు 30 మంది అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన అధికారులను ఆయా స్థానాల్లో వెంటనే రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.






