20 March, 2026 | 3:34 AM

తమిళనాట త్రిముఖ పోరు

20-03-2026 12:11 AM

ఇస్కా రాజేష్ బాబు :

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రం ఆసక్తికరమైన మలుపు తిరి గింది. దశాబ్దాలుగా సాగుతున్న ద్రావిడ పక్షాల ఆధిపత్య పోరుకు భిన్నంగా, ఈ సారి బహుముఖ పోటీ నెలకొంది. అధికార డీఎంకే తన పీఠాన్ని కాపాడుకోవాలని చూస్తుంటే, అన్నాడీఎంకే, -బీజేపీ కూటమి కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలని అస్త్ర శస్త్రాలు సిద్ధం చేస్తున్నది. మరోవైపు, సినీ సూపర్‌స్టార్ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ, శశికళ కొత్త పార్టీ కూడా అక్కడి రాజకీయ సమీకరణాలను మార్చివేస్తున్నాయి.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నగా రా మోగిన నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాష్ట్రవ్యాప్తంగా 234 నియోజకవర్గాలు ఉండగా, ఈసారి త్రిము ఖ పోరు స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రస్తుత అధికార పార్టీ డీఎంకే తమ సంక్షేమ పథకాలు, ద్రావిడ సిద్ధాంతం ప్రాతిపదికన మళ్లీ గెలుస్తామనే ధీమాతో ఉంది. ముఖ్యమంత్రి స్టాలిన్ నాయకత్వంలో పార్టీ యం త్రాంగం క్షేత్రస్థాయిలో బలంగా పని చేస్తున్నది.

అటు ప్రధాన ప్రతిపక్షం అన్నా డీఎంకే, కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీతో జతకట్టి డీఎంకే వైఫల్యాలను ఎండగ డుతున్నది. ప్రధాని మోదీ స్వయంగా తమిళనాడు పర్యటనలు చేస్తూ, కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమిళ సంస్కృతిని, భాషను ప్రస్తావిస్తూ బీజేపీ బలాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు. 

విజయ్ హామీల వర్షం

తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడిగా విజయ్ తన రాజకీయ అరంగేట్రాన్ని ఘనంగా చాటుతున్నారు. తన ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రకటించిన హామీ లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారా యి. ముఖ్యంగా మహిళా ఓటర్లే లక్ష్యంగా ఆయన వరాల జల్లు కురిపించారు. అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించా రు. ప్రస్తుత ప్రభుత్వం కొన్ని బస్సులకే పరిమితం చేసిన ఉచిత ప్రయాణాన్ని, తాము అధికారంలోకి వస్తే అన్ని రకాల ప్రభుత్వ బస్సులకు వర్తింపజేస్తామని స్పష్టం చేశా రు.

ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం 8 గ్రాముల బంగారం, పట్టుచీర అందజేసే ‘అన్న విజ య్ సాయం’ పథకం ఆకర్షిస్తున్నది. ప్రతి కుటుంబానికి ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే ‘అన్నపూర్ణి సూపర్ సిక్స్’ పథకం సామాన్యుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు కో సం విజయ్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లల తల్లులకు లేదా సంరక్షకులకు ఏడాదికి రూ.15,000 ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.

దీనికి ‘కామ రాజార్ కల్వి ఉరుత్తి తిత్తమ్’ అని పేరు పెట్టారు. దీనివల్ల పేదరికం కారణంగా చదువు మధ్యలో ఆపేసే పిల్లల సం ఖ్య తగ్గుతుందని ఆయన విశ్వసిస్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉచి త ఉన్నత విద్య అందించడం, రైతులకు రుణ మాఫీ వంటి హామీలు గ్రామీణ ఓటర్లలో టీవీకే పట్ల సానుకూలతను పెంచు తున్నాయి. కేవలం ఉచిత పథకాలే కాకుం డా, వ్యవస్థాగత మార్పులకు కూడా ప్రా ధాన్యం ఇస్తామని విజయ్ తన ప్రసంగాల్లో పేర్కొంటున్నారు.

మహిళా భద్రతకు ప్రాధాన్యం

మహిళల రక్షణ కోసం విజయ్ అత్యం త కీలకమైన హామీలను ప్రకటించారు. ‘రాణి వేలు నాచాయర్ ఫోర్సెస్’ పేరుతో ప్రత్యేక మహిళా పోలీసు విభాగం ఏర్పా టు చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో బాడీ కెమెరాలతో కూడిన 500 బృందాలను నిరంత రం పర్యవేక్షణ కోసం నియమిస్తామన్నా రు.

ప్రజా రవాణా వ్యవస్థలో మహిళ ల భద్రతకు భరోసా కల్పిస్తూ స్మార్ట్ పానిక్ బటన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. బటన్ నొక్కిన 5 నిమిషాల్లోనే కమాండ్ కేంద్రం నుంచి స్పందన వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చీకటి ప్రాంతాల్లో వెలుతురు, సీసీటీవీ నిఘా పెంచేలా ‘జీరో డార్క్ స్పాట్స్’ అనే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పడం మహిళల్లో ధైర్యాన్ని నింపుతోంది.

సర్వే ఫలితాలు.. డీఎంకే వైపే మొగ్గు

ప్రముఖ సర్వే సంస్థ పారావీల్ కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ తమిళనాడు ఎన్నికల ఫలితాలపై తన అంచనాలను వెల్లడిం చింది. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో బూత్ స్థాయి నుంచి సేకరించిన అభిప్రాయాల ప్రకారం, రాష్ట్రంలో మళ్లీ డీఎంకే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

సర్వే ప్రకారం డీఎంకేకు 41.5 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అన్నాడీఎం, కే-బీజేపీ కూటమికి 36.2 శాతం మంది మద్దతు లభించింది. కొత్తగా రం గంలోకి దిగిన విజయ్ టీవీకే పార్టీ 13.6 శాతం ఓట్లు సాధించి కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉంది. సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి పార్టీ  7.9 శాతం ఓట్లతో తన ఉనికిని చాటుకోనుంది. 

శశికళ రాజకీయ పునఃప్రవేశం

తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం వికే శశికళ కొత్త పార్టీ ప్రకటన. దివంగత జయలలిత నెచ్చెలిగా పేరున్న ఆమె ‘ఆల్ ఇండియా పురచ్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కజగం’ పేరుతో పార్టీని స్థాపించారు. కొబ్బరి తోటను పార్టీ గుర్తు గా ప్రకటించి, అన్నాడీఎంకే కేడర్ను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. తొమ్మిదేళ్ల మౌనం తర్వాత ప్రజల కోసం బయటకు వచ్చానని ఆమె భావోద్వేగంతో చెబుతున్నారు.

ఎంజీఆర్, జయలలిత ఆశయాల బాటలో నడుస్తానని, తనను ద్రో హం చేసిన వారిని రాజకీయాల నుంచి పెకిలించి వేస్తామని ఆమె హెచ్చరించారు. శశికళకు ప్రస్తుతానికి ఎన్నికల్లో పోటీ చేసే చట్టపరమైన అనుమతి లేకపోయినా, ఆమె పార్టీ అభ్యర్థులు అన్నాడీఎంకే ఓట్ల ను చీల్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో కేవలం ఆర్థిక హామీలే కాకుండా, ప్రజల ఆరోగ్యం కోసం కూడా ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని యువత కోరుతోంది.

విజయ్ తన హామీ ల్లో ప్రత్యేక ఆరోగ్య విభాగం ఏర్పాటు చేస్తానని చెప్పడం ఈ నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాడులో ఈసారి ఎన్నికలు కేవలం రెండు పార్టీల మధ్య పోరాటం మాత్రమే కాదు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేకు వ్యత్యాసంగా సరికొత్త రాజకీయాన్ని తీసుకువస్తామని విజయ్ చెబుతున్నారు.

శశికళ ప్రభావం పాత క్యా డర్ పైన ఎలా ఉంటుందో చూడాలి. సర్వే లు డీఎంకేకు అనుకూలంగా ఉన్నప్పటికీ, విజయ్ ఇచ్చే హామీలు, శశికళ చీల్చే ఓట్లు తుది ఫలితాలను మార్చివేసే అవకాశం ఉంది. ఏదేమైనా, తమిళనాడు ప్రజలు ఈసారి మార్పును కోరుకుంటున్నారా అనేది వేచి చూడాలి. 

 వ్యాసకర్త సెల్: 93973 99298