19 July, 2026 | 3:20 PM

'రోమాంచకం' గ్లింప్స్ రిలీజ్.. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో కొత్త లవ్ స్టోరీ

07-07-2026 01:56 AM

భద్రకాళీ పిక్చర్స్, డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా కాంబోలో భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ కాంబోలో ఒక యంగ్ టీమ్‌తో ఫ్రెష్ లవ్ స్టోరీ మూవీ వస్తోంది. కొత్తదనంతో యూనిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఆ చిత్రమే ‘రోమాంచకం’. ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ జంటగా నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని సందీప్‌రెడ్డి వంగా సమర్పిస్తుండగా, ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్‌రెడ్డి రూపొందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 3న థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ హీరో, హీరోయిన్స్ మధ్య ఉన్న ప్రేమను, వారి మధ్య ఏర్పడిన దూరాన్ని చూపిస్తూ సాగింది.

‘అణువు అణువును ఉర్రూతలూపే ప్రణయ కల్లోలమే రోమాంచకం, ఊహకే అందని ఉవ్వెత్తునెగిసే ఉత్తుంగ తరంగమే రోమాంచకం..’ అంటూ గ్లింప్స్‌లో వచ్చిన లిరిక్స్ ఈ మూవీ ఎంత వైబ్రేటింగ్‌గా ఉండబోతుందో తెలియజేస్తోంది. సుమంత్ ప్రభాస్, అనంతిక జంట కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తోంది. ఉపేంద్ర లిమయె, వెంకటేశ్ కాకుమాను, నరేంద్ర రవి, మణి, సోహన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి డీవోపీ: పవన్ పప్పుల; మ్యూజిక్: వాసుకి వైభవ్.

FAQ's

రోమాంచకం మూవీ ఎప్పుడు విడుదల కానుంది?
సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తున్న 'రోమాంచకం' చిత్రం సెప్టెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.

రోమాంచకం మూవీ ఎప్పుడు విడుదల అవుతుంది?
సెప్టెంబర్ 3, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

రోమాంచకం సినిమాలో హీరో ఎవరు?
సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు.

హీరోయిన్ ఎవరు?
అనంతిక సనిల్‌కుమార్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

రోమాంచకం చిత్రాన్ని ఎవరు సమర్పిస్తున్నారు?
ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తున్నారు.

రోమాంచకం గ్లింప్స్‌లో ఏమి ప్రత్యేకం?
హీరో-హీరోయిన్ల మధ్య ప్రేమ, భావోద్వేగాలు, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.