7 July, 2026 | 2:44 AM

అమీర్ లోగ్ టీజర్ విడుదల

07-07-2026 01:54 AM

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్పీ బ్యానర్‌పై మాధవిరెడ్డి సోమ నిర్మాణంలో రమ ణారెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అమీర్ లోగ్’. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి పలువురు కీలక పాత్రలు పోషించారు.

ఈ మూవీని రానా స్పిరిట్ మీడియా రిలీజ్ చేయబోతోంది. ఈ క్రమంలో నిర్మాత వంశీ నందిపాటి మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్లో వంశీ నందిపాటి మాట్లాడుతూ.. “అమీర్ లోగ్’ మూవీని చూశాను. స్నేహం, ప్రేమ విషయంలో రిచ్. మిడిల్ క్లాస్ జీవితా ల్ని చూపించారు. సినిమాలో ఎంతో వైబ్ కనిపించింది. ప్రాపర్ హైదరాబాద్‌ను చూపించి న చిత్రాల జాబితాల్లో ‘అమీర్ లోగ్’ ఉంటుంది.

ఇలాంటి ఓ చక్కటి చిత్రానికి స్మరణ్ చక్కటి మ్యూజిక్ ఇచ్చారు. ఇలాంటి సినిమాలు ఆడితేనే తెలుగు పరిశ్రమ గర్వంగా తలెత్తుకుని తిరుగుతుంది. ఇలాంటి చిత్రాన్ని సపోర్ట్ చేస్తున్న స్పిరిట్ మీడియాకి థాంక్స్’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రమణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సందీప్, ‘కామ్రేడ్ కళ్యాణ్’ నిర్మాత వెంకట కృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి, మనోహర్ రెడ్డి, నటీనటులు మనోజ్, వేద జలంధర్, విశ్వేందర్ రెడ్డి కూడా మాట్లాడారు.