8 July, 2026 | 1:43 AM

లెనిన్ సెకాండాఫ్ ట్విస్టులు ఊహాతీతం

08-07-2026 01:11 AM

కింగ్ నాగార్జున

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన సరికొత్త చిత్రం ‘లెనిన్’. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్పీ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై చిత్రం తెరకెక్కింది. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన చిత్రం ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా తిరుపతిలో చిత్ర యూనిట్ భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. కార్యక్రమంలో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. దర్శకుడు మురళికిషోర్ అబ్బూరు చెప్పిన కథ, అందులోని రక రకాల పాత్రల కోణాలు తనకు ఎంతో నచ్చాయని, సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులను ఎవరూ ఊహించలేరన్నారు. ప్రేమ కోసం హిస్టరీలో ఎన్నో యుద్ధాలు జరిగాయని, ఈ చిత్రంలోనూ ఒక అద్భుతమైన ప్రేమకథ ఉందని వివరించారు. భారతి పాత్రలో నటించిన భాగ్యశ్రీ బోర్సె ఈ సినిమాకు హార్ట్ బీట్ లాం టిదని కొనియాడారు.

నిర్మాత నాగవంశీకి మాస్ పల్స్ బాగా తెలుసని నాగార్జున నవ్వు తూ అన్నారు. ఆ నమ్మకంతోనే ఏపీ అంతా ఆయన ఓన్‌గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది సీమ మట్టి కథ అని, సీమలో జరుగుతున్న మహాభారతం అని పేర్కొన్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి, ప్రేక్షక దేవుళ్ల సాక్షిగా వస్తున్నామని, ఈ సారి మనవాడు గట్టిగా కొడుతున్నాడని ధీమా వ్యక్తం చేశారు. హీరో అఖిల్ మాట్లాడుతూ ఈ మూవీతో ప్రేక్షకుల ఇంట్లో ఒకడిగా మారాలని ప్రయత్నించినట్లు చెప్పారు. సీమ బిడ్డ అయిన దర్శ కుడు నందు తన జర్నీని, పెయిన్ను ప్రతిబింబించేలా ఈ కథను సిద్ధం చేశాడన్నారు. నాగ వంశీతో కలిసి నాన్నకు వినిపించి ప్రాజెక్ట్ ఓకే చేశామని వెల్లడించారు.

తాను సినిమా గురిం చి ఎక్కువగా మాట్లాడనని, 10న థియేటర్లలో సినిమానే మాట్లాడుతుందని అన్నారు. నిర్మా త సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. సినిమా ఎంగేజింగ్‌గా ఉంటుందని, చాలా సర్ ప్రైజ్లు ఉంటాయని చెప్పారు. అఖిల్ ఈ సారి ఎవరినీ నిరాశపరచడని, ఇంటర్వెల్‌తో పాటు చివరి 40 నిమిషాలు ప్రేక్షకులు ఖంగుతినేలా ఉంటాయని హామీ ఇచ్చారు. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుందని తెలిపారు. తమన్, తన కాంబినేషన్లో అపజయం అనేదే లేదని, ఈ సారి కూడా బ్లాక్ బస్టర్ ఖాయమని స్పష్టం చేశారు. హిట్ కొట్టిన తర్వాతే మాట్లాడదామని నాగార్జునతో అన్నట్లు గుర్తు చేశారు. 

హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ తన కెరీర్లో భారతి అనే పాత్ర ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. నాగార్జున తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని ఆశిస్తున్నట్లు తెలిపారు. నటులు శివాజీ, బ్రహ్మాజీ, సునీల్ సైతం చిత్రంపై ప్రశంసలు కురిపించారు. తా ము ఎక్కడా కనిపించమని, కేవలం పాత్రలు మాత్రమే స్క్రీన్‌పై కనిపిస్తాయని చెప్పారు. అఖిల్‌కు ఇది పర్ ఫెక్ట్ మూవీ అని, అభిమానులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ సినిమా లో ఉంటాయని పేర్కొన్నారు. జూలై 10న జూనియర్ కింగ్ రాబోతున్నాడంటూ ఈవెం ట్‌లో జోష్ నింపారు.  చిత్రానికి  థమన్ సం గీతం అందిస్తుండగా, ఎడిటర్‌గా నవీన్ నూలి వ్యవహరించారు. సినిమాటోగ్రఫీ లియోన్ బ్రిట్టో అందించారు.