3 August, 2026 | 9:26 AM

కరాటేలో సత్తా చాటిన తుంగతుర్తి విద్యార్థులు

03-08-2026 08:24 AM

ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో... మెంత బోయిన లాస్య ప్రథమ

బహుమతి, భయ్యా హర్షిత తృతీయ బహుమతి పట్ల సార్వత్రా హర్షం.

తుంగతుర్తి (విజయక్రాంతి): హైదరాబాదులో జరిగిన ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో సత్తా చాటిన తుంగతుర్తి కరాటే విద్యార్థులు మెంతబోయిన లాస్య, బయ్యా హర్షిత పాఠశాలలో చదువులోనే కాదు, కరాటే విద్యలో కూడా పార్టిసిపేట్ చేసే ప్రతి ఆటలోనూ ముందుంటూ ఎన్నో పథకాలు సాధించారు. సుమన్ చోట కరాటే ఆధ్వర్యంలో తుంగతుర్తి కరాటే ప్రత్యేక శిక్షణ నిపుణురాలు బొంకూరి అరుణ శ్రమ, పట్టుదల, శిక్షణలో, ఆగస్టు 2   ఆదివారం నాడు ,హైదరాబాద్ లో జరిగిన ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో మన విద్యార్థులు సత్తా మరోసారి  చాటారు.

మన తుంగతుర్తి తరఫున ఇద్దరు పాల్గొనగా, ఇద్దరు కూడా ప్రధమ, తృతీయ బహుమతులను సొంతం చేసుకున్నారు. వీరికి లేరు ఎవరు సాటి అని నేటి సమాజానికి, చాటి చెబుతున్నారు వీళ్ళు ఆడపిల్లలు కాదు లేడీ సింహం పిల్లల లాగా దేనికి తగ్గం అంటూ, అన్ని రంగాలలో దూసుకెళ్తున్నారు. దీనితో కరాటే కోచ్ అరుణతోపాటు, మేధావులు యువత గ్రామస్తులు ప్రత్యేకంగా విద్యార్థులకు అభినందనలు తెలిపారు.