3 August, 2026 | 9:01 AM

అటవీ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

03-08-2026 08:28 AM

అచ్చంపేట: అచ్చంపేటలోని చౌసింఘా హాల్‌లో సోమవారం జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ (JFOA) నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడి అధ్యక్షతన జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ సిబ్బంది విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, శాఖాపరమైన సమస్యలు, సిబ్బంది సంక్షేమం, సేవా పరిస్థితుల మెరుగుదల వంటి అంశాలపై సభ్యులు విస్తృతంగా చర్చించారు. అటవీ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి సంఘం తరఫున సమిష్టిగా కృషి చేయాలని సమావేశంలో తీర్మానించారు. అటవీ సంపద సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణలో అటవీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నందున వారికి మెరుగైన పని వాతావరణం, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సభ్యులు అభిప్రాయపడ్డారు. సమావేశంలో జిల్లా అటవీ సంఘం అధ్యక్షుడు రవికుమార్, ముజీబ్ ఘోరి, రాంబాబు, తేజ, హన్మంతుతో పాటు నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని డిప్యూటీ రేంజ్ అధికారులు, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు పాల్గొన్నారు.