టికెట్ ధరలు అందుబాటులోకి తెస్తాం
* పర్సనల్‌గా థాంక్యూ.. కల్యాణ్ బాబాయ్
* సక్సెస్ మీట్‌లో అల్లు అర్జున్
‘పుష్ప 2: ది రూల్’ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. తొలిరోజే బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తొలిరోజు రూ.294 కోట్లు రాబట్టి దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. రెండోరోజు గ్రాస్ కలెక్షన్లు రూ.500 కోట్లకు చేరాయి. శనివారం చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ హాజరయ్యారు. అల్లు అర్జున్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు చెప్పడం ఆసక్తికరంగా మారింది.
ఆయన మాట్లాడుతూ.. “సినిమా పరంగా ఎవరికి పేరొచ్చినా అదంతా దర్శకుడికే చెందుతుంది. నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే సుకుమార్‌కు నాపై ఉన్న ప్రేమే కారణం. తంతే అక్కడ కూర్చోబెట్టావ్ (సుకుమార్‌ను ఉద్దేశించి). ఇది నేను అహంకారంతో కాదు.. వినమ్రంగా చెబుతున్నా. తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డికి, ఏపీ సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు థాంక్యూ. ‘పర్సనల్‌గా థాంక్యూ కల్యాణ్ బాబాయ్” అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ.. ‘మూడు రోజులుగా నేను ఆనందంగా లేను.. మూడేళ్లు, ఆరేళ్లు కష్టపడి సినిమా తీసినా కూడా ఒక ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేను.
థియేటర్ వద్ద రేవతి మరణించిన ఘటనతో మనసు కకావికలమైంది. ఆమె కుటుంబానికి మేము అండగా ఉంటాం. ఆ బాధ నుంచి బయటపడిన తర్వాతే సినిమా కలెక్షన్స్ పెంచాం’ అని తెలిపారు. నిర్మాతలు మాట్లాడు తూ.. ‘టికెట్ ధర రూ.800 పెంచింది ప్రీమియర్ షోకే. త్వరలో ధరలు అందుబాటు లో ఉండేలా చూస్తాం’ అన్నారు.






