తిరుమల నిధులను దారిమళ్లించారు
- దేశంలోని ఏ ఆలయం నుంచి ఇలా బదలాయింపులు జరుగలేదు
- హిందూ ఆధ్యాత్మిక స్థలాలపై వైఎస్ జగన్‌ది కపట ప్రేమ
- గత వైసీపీ సర్కార్ తీరుపై ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఫైర్
హైదరాబాద్, జూలై 2: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తన పాలనలో తిరుమలను ఎస్టేట్‌గా మార్చుకున్నారని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయ న మీడియాతో మాట్లాడారు. ఎన్నడూ లేని విధంగా జగన్... 81 మందితో ధర్మకర్తల మండలి నియమించారని తెలిపారు. అయితే అందులో చాలామంది నేరచరిత్ర కలిగిఉన్నవారే ఉండటంతో ఈ విషయ మై కోర్టును ఆశ్రయించడంతో వారిని న్యాయస్థానం తొలగించిందని స్పష్టం చేశారు. దేశంలో ఏ ఆలయం నుంచి పం చాయతీలకు, మున్సిపాలిటీలకు నిధుల బదలాయింపు జరగదని.. కానీ తిరుమలలో అలాంటి చర్యకు జగన్ సర్కార్ పాల్పడిందని అన్నారు.
టీటీడీ చైర్మన్‌గా వ్యవహరించిన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఇంజినీరింగ్ పనుల్లో 10 నుంచి 15 శాతం కమీషన్ తీసుకున్నారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. గత ఐదేళ్లలో నిధుల మళ్లింపు, అవినీతిని నిగ్గుతేల్చేందుకు ఏపీ స్టేట్ విజిలిన్స్ విచారణ జరుపుతోందని అయితే ఆ విజిలెన్స్ ఉన్నతాధికారిపై మొదట విచారణ చేశాక మిగతా విచారణ చేపట్టాలన్నారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్మించిన భవనాన్ని కలెక్టర్ కార్యాలయం కోసం తీసుకొని ఇప్పటి వరకు ఒక్క పైసా అద్దె ఇవ్వలేదని.. హిందూ ఆధ్యాత్మిక స్థలాలపై గత ప్రభుత్వం తీరుకు ఈ ఘటన నిదర్శనమని ఆయన అన్నారు.






