16 July, 2026 | 11:07 PM

రేపు భారత్ బంద్

03-07-2024 03:10 AM
  • నీట్ అవకతవకలు, పేపర్ లీక్‌కు నిరసనగా విద్యార్థి, యువజన సంఘాల పిలుపు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 2 (విజయక్రాంతి): నీట్  పేపర్ లీక్, పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలకు నిరసనగా గురువారం భారత్ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు విద్యార్థి, యువజన సంఘాల నాయకులు తెలిపారు. ఈ బంద్‌కు ప్రజలు స్వచ్ఛం దంగా మద్దతు తెలపాలని కోరారు. తెలంగాణ జనసమితి కార్యాలయంలో ఎన్‌ఎస్ యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్ యూ, వీజేఎస్, డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్, పీవైఎల్, వైజేఎస్ తదితర విద్యార్థి, యువజన సంఘాల నాయకులు  బంద్‌కు సంబంధించిన పోస్టర్స్ ఆవిష్కరించారు.

ఎన్‌ఎస్‌యూ ఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూర్ వెంక ట్ మాట్లాడుతూ.. 6 నుంచి నీట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని కేంద్రం మొండిగా వ్వవహరించడం సరికాదని విమర్శించారు. నీట్‌ను వెంటనే రద్దు చేసి, తిరిగి పరీక్షను నిర్వహించాలని, కేంద్రం స్పందించకుంటే పోరా టాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.