5 May, 2026 | 9:15 PM

ఏరియా పర్సనల్ మేనేజర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన తిరుపతి

05-05-2026 07:54 PM

మర్యాదపూర్వకంగా కలిసిన కొత్తగూడెం ఐఎన్టియూసి నాయకులు

కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం ఏరియా జిఎం ఆఫీస్ నందు పర్సనల్ మేనేజర్ గా నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఎల్.తిరుపతిను ఐఎన్టీయూసీ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్, ఎండి రజాక్ ఆధ్వర్యంలో ఐఎన్టియూసి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా మరియు పూల బొకేతో సన్మానించారు.

అనంతరం రజాక్ మాట్లాడుతూ, కార్మికులకు రావలసిన ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ సకాలంలో ఇచ్చే విధంగా చూడాలని  కార్మికుల సంక్షేమం సమస్యల పరిష్కారం సంస్థ అభివృద్ధికి పరస్పర సహకారం అందే  విధంగా చూడాలని, యాజమాన్యం, కార్మికుల తో సత్సంబంధాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. ఎల్.తిరుపతి పర్సనల్ మేనేజర్  తమ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తారని కార్మికులకు న్యాయం చేసేలా, సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.