calender_icon.png 26 August, 2025 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ శ్రేయస్సుకు పాటుపడాలి

14-08-2024 01:21:03 AM

  1. స్వామి అభిషేక్ బ్రహ్మచారి 
  2. ముగిసిన విద్యాకోటి కుంకుమార్చన 
  3. చివరి రోజు పూర్ణాహుతి మహాయజ్ఞం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 13 (విజయక్రాంతి): లలితా మాత ఆశీస్సులతో ప్రతిఒక్కరూ దేశ శ్రేయస్సుకు కృషి చేయాల ని స్వామి అభిషేక్ బ్రహ్మచారి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ స్కందగిరి మఠంలో మూడు రోజుల పాటు జరుగుతున్న విద్యాకోటి కుంకుమార్చన, యజ్ఞం మంగళవా రంతో ముగిసింది. చివరి రోజు స్వామి అభిషేక్ బ్రహ్మచారి ఆధ్వర్యంలో వేద పండితు లు లలితాదేవికి సుహాసినీ పూజ, పూర్ణాహుతి నిర్వహించారు. టన్ను కుంకుమ, ఒక కోటి లలితా సహస్రనామ మంత్రాలతో మహాయజ్ఞం చేశారు. ఈ సందర్భంగా స్వామి అభిషేక్ బ్రహ్మచారి మాట్లాడుతూ.. సనాతన ధర్మం అందరికీ మంచి చేస్తుందన్నారు.

కొందరు తమ స్వార్థం కోసం సనా తన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారని, వారు ఈ ధర్మాన్ని దెబ్బతీయలేరన్నారు. సమాజంలోని అన్ని వర్గాల పురోగమనమే రామ రాజ్యానికి నిజమైన అర్థమన్నారు. దేవుడిపై పోరాడే శక్తి ఎవరికీ లేదని హెచ్చరించారు. లలితామాత శ్రేయస్సు, దేశోద్ధరణ కోసం త్వరలో ఐదు కోట్ల విద్యాకోటి కుంకుమార్చ న మహాయజ్ఞం నిర్వహిస్తామన్నారు. యువచేతన జాతీయ కన్వీనర్ రోహిత్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ.. పేద, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

గతంలో భారతదే శాన్ని చిన్నతనంతో చూసేవారని కానీ ఇప్పు డు భారతదేశ నాయకత్వాన్ని ప్రపంచ దేశా లు అంగీకరిస్తున్నాయన్నారు. 2047నాటికి భారత్‌ను ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. పూజల్లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ సీనియర్ నేత మురళీధర్‌రావు పాల్గొన్నారు.