26-08-2025 10:25:25 PM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని బోథ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ కలిసారు. ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నివాసంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ తో కలిసి కేటిఆర్ ను ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలపై, నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులపై కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఎమ్మెల్యే కు పలు సూచనలు చేశారు.