calender_icon.png 27 August, 2025 | 1:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మట్టి గణపతి విగ్రహాలను వినియోగించాలి

26-08-2025 10:31:52 PM

గద్వాల: పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి విగ్రహాలను వినియోగించాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ అన్నారు. మంగళవారం ఐడిఓసి ఆవరణలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తయారు చేసిన 2000 మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి విగ్రహాల వినియోగం ఎంతో ముఖ్యమని అన్నారు.

సాధారణంగా,ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నదులు లేదా చెరువుల్లో వేయడం ద్వారా వాటిలోని రసాయన పదార్థాలు నీటిని కలుషితం చేస్తాయని తెలిపారు. మట్టి విగ్రహాలు సహజంగా కరిగి పోతాయని,వాటి వినియోగం పర్యావరణానికి ఎటువంటి హానీ కలిగించదని వివరించారు.పట్టణాలతో పాటు గ్రామాలలో కూడా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని,గణేష్ చతుర్థి పర్యావరణహిత పండుగగా జరుపుకోవాలన్నారు. ఈ సందర్బంగా కలెక్టరేట్లో మట్టి వినాయక విగ్రహాలను పంపిణి చేయడం జరిగింది.