calender_icon.png 26 August, 2025 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలువలతో కూడిన విద్యనందించాలి

14-08-2024 01:15:13 AM

  1. కాలానికి అనుగుణంగా సిలబస్ 
  2. ఏపీ సీఎం చంద్రబాబు

హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): రాష్ట్ర విద్యాశాఖలో సమూల మార్పులు జరిగాయని, ఉత్తమ విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అం దించడమే లక్ష్యంగా పనిచేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యపై ప్రభుత్వం రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, క్షేత్రస్థాయిలో దీనికి తగ్గ ఫలితాలు కనిపించాలని స్పష్టంచేశారు. విద్యాశాఖ, నైపుణ్య గణన అంశాలపై మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని సిలబస్‌లో మార్పులు చేయాలని సూచించారు. ఇందుకోసం విద్యారంగం నిపుణులు, మేధావులు ఆయా రంగాల ప్రముఖులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు.

వచ్చే 20 ఏళ్ల వరకు ఎలాంటి పాఠ్యాంశాలు అవసరమనే అంశాన్ని గుర్తించి బోధిస్తే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ప్రచారం ఆర్భాటం కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని, బడి ఈడు పిల్లలు బయట ఉండటానికి వీలులేదని, ఈ విషయంలో కఠినంగా ఉండాలని అధికారులను హెచ్చరించారు. ప్రైవేటు విద్యాసంస్థలతో ప్రభుత్వ బడులు పోటీ పడాలని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు.

విద్యాశాఖలో తీసుకుంటున్న నూతన విధానాలు, సంస్కర ణలపై విద్యాశాఖ మంత్రి లోకేశ్ వివరించారు. ఒక తరగతికి ఒక టీచర్ అనే విధానం అమలు చేస్తున్నామని, ఉపాధ్యాయులపై అనవసరపు ఒత్తిడి లేకుండా యాప్‌ల భారం తగ్గించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా అధికారులు నైపుణ్య గణన కార్యక్రమం ప్రజెంటేషన్ ఇచ్చా రు. రాష్ట్రంలో 3.54 కోట్ల మంది పనిచేసే వయసు వారు ఉన్నారని, వారి నైపుణ్యాలను గణన చేయాల్సి ఉందని వివరించారు. పారిశ్రామిక రంగ ప్రతినిధులతో చర్చించి నైపుణ్య గణన కార్యక్ర మం చేపట్టాలని సీఎం ఆదేశించారు.